మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 4: తన ప్రేమను అంగీకరించలేదన్న కక్షతో ఓ యువకుడు యువతిపై కత్తితో దాడిచేసిన ఘటన మెదక్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకున్నది. మెదక్ పట్టణ పరిధిలోని అవుసులపల్లికి చెందిన యువతి మెదక్ డిగ్రీ కళాశాలలో ఓపెన్ డిగ్రీ పరీక్ష రాస్తున్నది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ఉండగా ఉదయం 8.30 గంటలకే కళాశాల వద్దకు చేరుకున్నది. అప్పటికే అక్కడికి చేరుకున్న హైదరాబాద్కు చెందిన చైతన్య ఆమె చేతిలో నుంచి సెల్ఫోన్ లాక్కొని పగులకొట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె కుడి చేతిని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. పోలీసులు ఆ యువతికి ప్రాథమిక చికిత్స చేయించి గాంధీ దవాఖానకు తరలించారు. మెదక్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.