జోగులాంబ గద్వాల : సర్టిఫికెట్లు(Certificates) ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని, అంతవరకు వెళ్లే ప్రసక్తే లేదని ఓ యువతి తహసీల్దార్ కార్యాలయంలో(Tahsildar office) నిరసన వ్యక్తం చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. జోగులాంబ గద్వాల జిల్లా(Gadwal Dist) నారాయణపురం గ్రామానికి చెందిన హైమావతి అనే యువతి ఓబీసీ, కుల, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే తనకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అధికారులు వారం రోజుల పాటు కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆరోపించింది. తనకు సర్టిఫికెట్లు జారీ చేస్తే తప్పా ఇక్కడ నుంచి కదలనని తహసీల్దార్ కార్యాలయంలో బైఠాయించింది. దీంతో మానవపాడు తహశీల్దార్ వహీదా యువతిని సముదాయించి సర్టిఫికెట్లను జారీ చేశారు.
సర్టిఫికెట్లు కోసం కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని తహశీల్దార్‌ను నిలదీసిన యువతి
సర్టిఫికెట్లు ఇస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని సర్టిఫికెట్లను ఇప్పించుకున్న యువతి
గద్వాల – మానవపాడు తహశీల్దార్ వహీదాను ఓ యువతి నిలదీసింది.. నారాయణపురం గ్రామానికి చెందిన హైమావతి ఓబీసీ,… pic.twitter.com/Mxk0mL4rYq
— Telugu Scribe (@TeluguScribe) October 15, 2024