ఎల్కతుర్తి, ఆగస్టు 24: పెండ్లి చేసుకోవడం ఇష్టం లేని ప్రియుడు, కూతురి టార్చర్ భరించలేని తండ్రి వెరసి యువతి హత్యకు గురైన ఉదంతం ఇది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సంచలనం సృష్టించిన కారు డిక్కీలో యువతి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 21న ఎల్కతుర్తి బస్‌స్టాండ్ సమీపంలో గల కారు నుంచి దుర్వాసన వస్తున్నదని స్థానికు లు చెప్పగా, పోలీసులు వెళ్లి చూడగా డిక్కీలో యువతి మృతదేహం కనిపించింది.
పోలీసు ల దర్యాప్తులో మృతురాలిని పెద్దపల్లి జిల్లా సెంటినరీకాలనీకి చెందిన అంకతి రాజేశం కూతురు మానసగా గుర్తించారు. ఎల్కతుర్తికి చెందిన ఎడెల్లి వినోద్‌కుమార్ హత్య చేసినట్టు పోలీసులు గుర్తించి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు ఎల్కతుర్తి శివారులో ఉన్నాడనే సమాచారం మేరకు ఆదివారం సీఐ పులి రమేశ్, ఎస్సై నర్సింహారావు అదుపులోకి తీసుకొని విచారించారు. వినోద్‌కుమార్ కుటుంబసభ్యులు గతంలో గోదావరిఖనిలో ఉండటంతో అతనికి మానసతో పరిచయం ఉంది. కాగా, మానసకు గతంలో రెండు పెండ్లిళ్లు అయి విడాకులయ్యాయి. అప్పటినుంచి తల్లిదండ్రులతోనే ఉంటున్నది.
ఆమె వారి మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఇబ్బందులు పెట్టేది. ఈ నెల 16న అరుణాచలం వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి, కరీంనగర్లో వినోద్‌కుమార్‌తో ఉన్నానని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిం ది. 18న తనను పెండ్లి చేసుకోవాలని వినోద్‌కుమార్‌ను మానస డిమాండ్ చేసింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ విషయాన్ని నిందితుడు యువతి తండ్రికి ఫోన్ చేసి తెలుపగా.. ‘ఆమె భూమి మీద బతికి ఉంటే మమ్మల్ని, నిన్ను ఇట్లనే ఇబ్బంది పెడుతది’ ఏదో ఒకటి చేసి మాకు బాధ లేకుండా చేయమని కోరాడు. దీంతో నిందితుడు మా నసను గొంతు పిసికి హత్య చేశాడు. అనంత రం మృతదేహాన్ని కారు డిక్కీలో ఎల్కతుర్తికి తీసుకొచ్చి పార్కింగ్ చేసి ఉంచినట్టు ఏసీపీ తెలిపారు. నిందితుడిని సోమవారం కోర్టులో హాజరుపర్చుతున్నామని, రాజేశం పరారీలో ఉన్నట్టు తెలిపారు.