Visakhapatnam | ఏపీలోని విశాఖపట్నం బీచ్లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని తెలంగాణ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలంర రేపింది. బాధితురాలిని తెలంగాణ ప్రాంతానికి చెందిన లావణ్యప్రియ ఆర్కే బీచ్ రోడ్డులో తన వెంట తెచ్చుకున్న పెట్రోలును ఒంటిపై పోసుకొని నిప్పటించుకుంది. గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి మంటలను అదుపు చేసి పోలీసులకు సమాచారమిచ్చారు.
ఈ ప్రమాదంలో యువతి చేతులు, ముఖం, తల భాగం తీవ్రంగా కాలిపోయాయని, సదరు యువతిని కింగ్ జార్జ్ హాస్పిటల్కు తరలించామని పోలీసులు పేర్కొన్నారు. యువతి పరిస్థితి విషమం ఉందని ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏపీ పోలీసులు తెలిపారు.