నాగర్ కర్నూల్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి హింసను, ఆత్మహత్యలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు గాను సీఎంపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఈనెల 11వ తేదీన హైదరాబాద్లోని మర్రి చిన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో సీఎం చేసిన వాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయని అన్నారు.
కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి తాను చేసిన వాఖ్యలను తిరిగి వెనక్కి తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వర్ రెడ్డి, తిరుపతిరెడ్డి, అశోక్, జగదీశ్వర్ రెడ్డి, శేఖర్ రావు, శంకర్, ఆంజనేయులు, సుదర్శన్, రాములు, బాలస్వామి, నాగిరెడ్డి, మహేష్ రావు, గపూర్, నరసింహ, శీను, ఉషన్న, తదితరులు ఉన్నారు.