మేడ్చల్, జూన్ 1 : పరీక్షల ఒత్తిడికి గురై ఓ యువతి ఆత్మహత్య చేసుకొన్నది. ఈ ఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా నకిరేకల్‌కు చెందిన కోమరాజు సైదులు దంపతుల కొడుకు కృష్ణసాయి, కూతురు సంగీత (24) మేడ్చల్‌లోని రాఘవేంద్ర కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. సంగీత గ్రూప్ 1, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం అవుతుండగా, ఆమె తమ్ముడు కృష్ణసాయి మేడ్చల్ రత్నదీప్‌లో డాటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు.
నాలుగు నెలల నుంచి పరీక్షలకు సిద్ధం అవుతున్న సంగీత గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడికి లోనైంది. తమ్ముడితో పరీక్షలంటే భయంగా ఉన్నదని చెప్తుండేది. సాయికృష్ణ శనివారం ఉదయం విధుల నిమి త్తం రత్నదీప్కు వెళ్లాడు. కొద్దిసేపటికీ సంగీతకు ఫోన్ చేయగా తీయలేదు. దీంతో అనుమానంతో కృష్ణసాయి గదికి రాగా, తలుపులకు లోపల గడియ పెట్టి ఉంది. బలవంతంగా తోసుకోని వెళ్లగా, సంగీత ఫ్యాన్‌కు ఉరేసుకొన్నది. పోలీసులు కేసు నమోదు చేశారు.