కట్టంగూర్, నవంబర్ 12: అప్పుల బాధలు భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల చెందిన తండు కంఠమహేశ్వరం (35) గ్రామంలో తనకున్న రెండు ఎకరాలతోపాటు మరో 4ఎకరాలు భూమిని కౌలుకు తీసుకున్నాడు. అప్పులు చేసి సాగుచేసిన పత్తిలో ఆశించిన దిగుబడి రాక నష్టపోయా డు. అప్పులు తీర్చే దారిలేక మనస్తాపానికి గురై సోమవారం వ్యవసాయ బావి వద్ద పురుగులమందు తాగా డు. కుటుంబ సభ్యులు నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య భవానీ ఫిర్యాదు మేరకు కేసు దర్యా ప్తు చేస్తున్నట్టు ఎస్సై రవీందర్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.