నాగర్కర్నూల్ : నాగర్కర్నూల్(Nagarkurnool) జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బిజినేపల్లి మండల పరిధిలోని వట్టెం గ్రామ శివారులో ఓ యువతిని మరో యువకుడు హత మార్చిన(Brutal murder) సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కల్వకుంట తండాకు చెందిన చిట్టెమ్మ (28) తన భర్తతో గతంలో విడాకులు తీసుకుంది. అనంతరం బిజినేపల్లి గ్రామానికి చెందిన శివ అనే యువకుడితో గత కొంతకాలంగా వివాహేతర సంబంధం(Extramarital affair) కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
ఇది ఇలా ఉండగా శివ చిట్టెమ్మకు పోన్ చేసి ఆదివారం రాత్రి వట్టెం గ్రామ శివారులోని పొలంలోకి రమ్మని చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో చిట్టెమ్మ మృతి చెందింది. అనంతరం ఆమె మృతదేహాన్ని పక్కనే ఉన్న పత్తి చేనులో కప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో నిందితుడు లొంగిపోయాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.