కరీంనగర్ విద్యానగర్, సెప్టెంబర్ 7: జగిత్యాలకు చెందిన ఓ యువతి జ్వరంతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు ఈ నెల 6న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో అడ్మిట్ చేశారు. ఆ యువతికి శనివారం రాత్రి దవాఖానలో పని చేస్తున్న కాంపౌండర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి లైంగికదాడికి పాల్పడినట్టు యువతి తండ్రి త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.
బాధితురాలిని వైద్య పరీక్షలకు స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి మాట్లాడుతూ, యువతిపై లైంగికదాడి జరిగినట్టు ఫిర్యాదు అందిందని, కేసు దర్యాప్తు అనంతరం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.