శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 22:23:25

యువకుడిని బలిగొన్న పబ్జీ తరహా మొబైల్‌ గేమ్‌

 యువకుడిని బలిగొన్న పబ్జీ తరహా మొబైల్‌ గేమ్‌

కామారెడ్డి : పబ్జీ తరహా మొబైల్‌ గేమ్‌ యువకుడి ప్రాణాలను బలిగొంది. పబ్జీ తరహా ఆటకు బానిసైన యువకుడు ఉదయం నుంచి రాత్రివరకు ఫోన్‌లో ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో సోమవారం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సాయికృష్ణ (22)  తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ వద్ద ఉంటున్నాడు. గతంలో పబ్జీకి బానిసైన అతడు ఆ గేమ్‌ను నిషేధించడంతో అదే తరహా మరో గేమ్‌ను సెల్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని ఆడుతున్నాడు.

సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు గేమ్‌ ఆడుతూ అపస్మారక స్థితికి చేరాడు. చికిత్స నిమిత్తం బంధువులు అతడి హుటాహుటిన కామారెడ్డిలోని ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. అప్పటికే గుండెపోటుతో సాయికృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.