ఖైరతాబాద్, మార్చి 1 : ఆన్లైన్ రమ్మీకి అలవాటు పడిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం, ఏపీలోని శ్రీశైలంకు చెందిన సత్యనారాయణ-సత్యవతి కుమారుడు నూకరాజు (27 ) బీటెక్ చేశా డు. ఆన్లైన్ రమ్మీకి అలవాటుపడి అప్పులు చేయగా తల్లిదండ్రులు తీర్చివేశారు.
ఉద్యోగాన్వేషణలో నగరానికి వచ్చి, మణికంఠతో కలిసి అమీర్‌పేటలోని లాడ్జిలో ఉంటున్నా డు. ఇంటర్వ్యూలకు హాజరుకాగా ఉద్యోగం రాలేదు. ఊళ్లో ఉండలేక, ఉద్యోగంరాక మనస్తాపంతో శనివారం గదిలో ఫ్యానుకు ఉరేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ దవాఖానాకు తరలించారు.