నారాయణఖేడ్, నవంబర్ 7: అప్పుల బాధలు తాళలేక ఓ యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్లతంకు చెందిన వడిత్య విఠల్నాయక్ (36) తనకున్న రెండెకరాల భూమిని సాగు చేసుకోవడంతోపాటు చెరుకు నరికే పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. పం టల పెట్టుబడుల కోసం రూ.5 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులోళ్ల బాధలు భరించలేక మనస్తాపానికి గురయ్యాడు. విఠల్నాయక్ తన చేనులోని చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు నారాయణఖేడ్ ఎస్సై విద్యాచరణ్రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.