ఉప్పల్, జూలై 28 : స్నేహితులతో కలిసి బ్యాడ్మింటన్ ఆడుతున్న ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఈ ఘటన ఉప్పల్ భగాయత్తోని ఎలైట్ బ్యాడ్మింటన్ అకాడమీలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ ఎక్స్‌రోడ్డులోని మల్లయ్య అపార్ట్మెంట్లో నివాసముండే రాకేశ్(26) స్నేహితులతో కలిసి ఉప్పల్ భగాయత్‌లో బ్యాడ్మింటన్ ఆడేందుకు వచ్చాడు.
ఈ క్రమంలో బ్యాడ్మింటన్ ఆడుతుండగా సడన్‌గా కిందపడిపోయాడు. దీంతో స్నేహితులు అతన్ని నాగోల్‌లోని సుప్రజ దవాఖానకు తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. గుండెపోటుతో మృతిచెందినట్టు తేల్చారు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.