Skill University | హైదరాబాద్, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో దసరా నుంచి కోర్సులను ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. వర్సిటీలో 20 కోర్సులు నిర్వహించాలని గుర్తించగా, తొలుత ఆరు కోర్సులను ప్రారంభిస్తామని తెలిపారు.
వర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుపై శనివారం సచివాలయంలో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తొలుత సూల్ ఆఫ్ ఈ-కామర్స్, లాజిస్టిక్స్ రిటైల్ విభాగంలోనూ సర్టిఫికెట్ కోర్సులు, డిప్లొమా కోర్సులను ప్రారంభించనున్నట్టు చెప్పారు. యూనివర్సిటీ లోగో, వెబ్‌సైట్‌ను ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
ఆర్థిక, పరిశ్రమల శాఖల ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేశ్‌రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, శ్రీనిరాజు, సుబ్బారావు పాల్గొన్నారు.