రామన్నపేట, జూలై 4: అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం బోగారంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ..బోగారం గ్రామానికి చెందిన బద్దుల రాజు (34) గ్రామ శివారులో గల ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. పంట పెట్టుబడికి, బోరు మోటరు కోసం గత సంవత్సరం రెండు లక్షల వరకు అప్పుచేశాడు. పంట సరిగారాకపోవడంతో అప్పులు తీర్యలేకపోయాడు. దీంతో మానస్తాపానికి గురై ఇంట్లో ఎవరూలేని సమయంలో శుక్రవారం ఉదయం గడ్డిమందు తాగాడు. కుటుంబసభ్యులు నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. భార్య లలిత ఫిర్యాదు మేరకు ఎస్సై మల్లయ్య కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.