ఇంద్రవెల్లి, జనవరి 11 : కాలం కలిసి రాక.. సాగు కోసం చేసిన అప్పులు తీ ర్చే మార్గం లేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. ఇంద్రవెల్లి మండలం పిప్రి గ్రామానికి చెందిన కిన క శంకర్ (38) వ్యవసాయ పనులు చే స్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా డు. వ్యవసాయ పెట్టుబడికి తెలిసిన ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.2 లక్షలు అప్పు తీసుకున్నాడు. అతివృష్టి కారణంగా దిగుబడి రాకపోవడంతో తీసుకున్న అప్పు తీర్చిలేకపోయాడు. డబ్బులు చెల్లించాలని వడ్డీ వ్యాపారి ఒత్తిడి పెంచాడు. దీంతో శంకర్ మద్యానికి బానిసయ్యాడు. అప్పు చెల్లించే మార్గం లేక తాగిన మైకంలో గత నెల 31న పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్‌లో ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. పది రోజులుగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు.