స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 9 : అప్పుల బా ధ భరించలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెంలో చోటుచేసుకున్నది. బంధువుల కథనం మేర కు..కత్తుల రాజు (30) తనకున్న 1.20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఇటీవల రూ.5లక్షల వర కు అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నాడు. వాటిని తీర్చలేక మూడు రోజుల క్రితం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యు లు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించగా బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య వసంత, ఇద్దరు పిల్లలున్నారు.