హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): వాయవ్య బంగాళాఖాతం లో ‘దానా’ తీవ్ర తుపానుగా మారింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీతోపాటు పశ్చిమబెంగాల్, ఒడిశా, జార్ఖండ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దానా ప్రభావం ఎకువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీచేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు పడే అవకాశం ఉందని తెలిపారు.