Weather Update | ఎల్లో అలర్ట్.. రాష్ట్రంలో మరో రెండు రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎకువ ఆసారం ఉన్నదని, ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది.
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం
Weather Update | హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రాబోయే రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు ఎకువ ఆసారం ఉన్నదని, ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని తెలిపింది.
ఈ మేరకు ఆయా జిల్లాలకు అధికారులు ఎల్లోఅలర్ట్ జారీచేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే ప్రమాదమున్నదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే చాన్స్ ఉందని, ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు ఉదయం పొగమంచు పడొచ్చని పేర్కొన్నది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్రలో అల్లూరి, అంబేదర్ కోనసీమ, తూ.గో., ఏలూరు, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అకడకడా పిడుగులతో కూడిన మోస్తరు, మిలిగిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.
మంగళవారం యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కుమ్రంభీం జిల్లాలోని నెల్లిలో 2.7, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 2.1, సిరికొండలో 2, పిప్పల్ధారిలో 1.8, జైనథ్‌లో 1.7, ఆదిలాబాద్‌లో 1.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేరొన్నారు. అకాలవర్షాలతో మామిడి, బత్తాయి, నిమ్మ వంటి ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం జరుగుతున్నది. మొకజొన్న, వరి వంటి పంటలు వడగండ్లతో నేలకొరిగాయి. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు తీరనినష్టాన్ని మిగుల్చుతున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

