ఇల్లెందు, నవంబర్ 17 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ వై రమేశ్ వివరాల ప్రకారం.. ఈనెల 7న యాకుబ్పా షా ఓ రేషన్‌షాపులో తనిఖీలు చేప ట్టాడు. అక్కడ స్టాకు తక్కువగా ఉండ టంతో 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో యాకుబ్‌పాషా సూచన మేరకు సోమవారం రేషన్ డీలర్ శబరీష్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శబరీష్‌ను విచారణ చేయగా, డీటీ యాకుబ్‌పాషా, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఒత్తిడి మేరకే తీసుకున్నట్టు ఒప్పుకున్నాడు. దీంతో ముగ్గురిపై కేసు నమో దు చేసినట్టు తెలిపారు.
హైదరాబాద్, నవంబర్17 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు నిర్వర్తించే కార్యకలాపాలేవీ లేవు. ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలనూ చేపట్టలేదు. కానీ, సోషల్ మీడియా కోసం ఒక హ్యాండ్లర్, ఎగ్జిక్యూటివ్‌ను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించాలని యోచిస్తున్నది. ఈ మేరకు రెండు రాష్ర్టాలకు ఇటీవల ప్రతిపాదనలు పంపింది. అందుకు నెలకు రూ.60వేలు ఖర్చవుతుందని అం చనా వేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలని రాష్ర్టాలకు ఇటీవల లేఖ రాసింది. జీఆర్ఎంబీ ప్రతిపాదనలు తెలంగాణ తిరస్కరించింది. ఈ మేరకు బోర్డుకు తాజాగా లేఖ రాసింది. సోషల్‌మీడియా హ్యాండ్లర్ అవసరమేమీ లేదని తేల్చిచెప్పింది.