హైదరాబాద్, ఆగస్టు17 (నమస్తే తెలంగాణ) : యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా గొర్ల యశ్వంత్‌యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబురావుయాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌యాదవ్ యశ్వంత్‌కు శనివారం నియామకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యశ్వంత్ మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన యాదవ మహాసభ రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
‘ఏసీబీ కేసులో ఆస్తులను నిందితుడే నిరూపించుకోవాలి’
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టడంపై ఏసీబీ నమోదు చేసిన కేసులో ఆ ఆస్తులు ఎలా వచ్చాయో నిరూపించుకోవాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు తేల్చిచెప్పింది. ఈ కేసులో మాజీ పోస్టుమ్యాన్ సురేందర్‌కు దిగువ కోర్టు విధించిన మూడేండ్ల శిక్షను ఏడాదికి తగ్గించింది. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న సురేందర్‌ను జైలుకు పంపాలని స్పష్టం చేసింది.
సుఖేశ్గుప్తాకు చుకెదురు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఎంబీఎస్ జ్యువెలర్స్ అధినేత సుఖేశ్గుప్తాపై సీబీఐ కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎంఎంటీసీ ఫిర్యా దు మేరకు నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలంటూ సుఖేశ్‌గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. బంగారం సరఫరాకు సంబంధించి ఎంఎంటీసీ అధికారులతో కలిసి ఆ సంస్థకు సుకేశ్‌గుప్తా రూ.194 కోట్ల నష్టం కలిగించినట్టు సీబీఐ తన చార్జిషీట్లో అభియోగాలు మోపినందున కింది కోర్టులో పిటిషనర్ విచారణను ఎదుర్కోవాల్సిందేనని జస్టిస్ కే సుజన తేల్చిచెప్పారు.
గడువులోగా దాఖలు చేయని బిడ్‌ను స్వీకరించకపోవడం సబబే: హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు సరఫరా కోసం సకాలంలో దాఖలు చేయని బిడ్‌ను స్వీకరించకపోవడం సబబేనని హైకోర్టు తీర్పు చెప్పింది. సాంకేతిక కారణాల వల్ల ఆన్లైన్లో గడువులోగా బిడ్‌ను సమర్పించలేకపోయినందున తన బిడ్‌ను స్వీకరించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కొత్తగూడెం వాసి కిశోర్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. గడువు దాటాక బిడ్లను స్వీకరించడం టెండర్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నది. అధికారులు దురుద్దేశపూరితంగా టెండర్‌ను తిరసరించినట్టయితేనే న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంటుందని, ఇక్కడ ఆ పరిస్థితి లేదని స్పష్టం చేసింది.