ములుగు : సర్పంచ్ల(Sarpanchs) పెండింగ్ బిల్లుల(Pending bills )చెల్లింపులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ (Yadaiah Goud )డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లులను చెల్లించకుంటే గ్రామస్థాయిలో చేపట్టిన నిర్మాణాలకు తాళాలు వేసి పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ సర్పంచ్‌లపై కక్ష సాధింపు చర్యలకు పూనుకుందన్నారు. ఇందులో భాగంగానే పెండింగ్ బిల్లులను చెల్లించడం లేదని ఆరోపించారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క ఈ విషయంలో పెద్దక్క పాత్ర వహించాలని హితవు పలికారు. సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.