యాదగిరిగుట్ట, మార్చి 18: యాదగిరీశుడి కల్యాణోత్సవాన్ని సోమవారం రాత్రి 8:45 గంటలకు నిర్వహించారు. స్వామి గజ వాహనంపై, అమ్మవారిని పుష్పాల పల్లకిలో కల్యాణ వేదికకు తీసుకొచ్చారు. కల్యాణ మహోత్సవాన్ని ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వేంకటాచార్యులు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఆలయం తరఫున అనువంశిక ధర్మకర్త నర్సింహమూర్తి, ఈవో భాస్కర్రావు పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.