యాదాద్రి, జూలై 25: పంచనారసింహుడిగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారికి సోమవారం సాయంత్రం దర్బార్సేవ వైభవంగా నిర్వహించారు. నాలుగు వేదాల ను పారాయణం చేసి, స్వామివారి స్వస్తి మం త్రార్థాలతో శాంతింపజేశారు. అనంతరం స్వామివారు గర్భాలయంలో వేంచేశారు. ప్రధానాలయంలో ఉత్సవమూర్తికి ఉభయ జోడుసేవలు జరిపారు. గరుడ వాహనసేవ, అమ్మవారి తిరుచ్చి సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు తిరువారాధన చేపట్టారు. స్వామివారికి సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన చేశా రు. తెల్లవారుజామున 3:30 నుంచి రాత్రి 9:45 గంటల వరకు స్వామివారి నిత్య కైంకర్యా లు ఆగమశాస్త్రరీతిలో సాగాయి. అనంతరం స్వామివారికి శయనోత్సవం నిర్వహించి ద్వారబంధనం చేపట్టారు. రూ.22.93 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో తెలిపారు.