యాదగిరిగుట్ట, జూలై 4 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి 19 రోజుల హుండీల ఆదాయం రూ.కోటిన్నర దాటిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలో మంగళవారం హుండీలను లెక్కించారు. ఇందులో 1,85,96,202 నగదుతోపాటు 159 గ్రాముల మిశ్రమ బంగారం, 7 కిలోల 300 గ్రాముల మిశ్రమ వెండి, 1,249 యూఎస్ డాలర్లు, 65 దిరామ్స్, ఆస్ట్రేలియా డాలర్లు 150, కెనడా డాలర్లు 5, థాయిలాండ్, ఇండోనేషియా, కువైట్, బహ్రెన్ దేశాలకు చెందిన కరెన్సీ సమకూరినట్టు ఆమె పేర్కొన్నారు.