యాదగిరిగుట్ట, మే 12: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని మహా అద్భుతంగా పునర్నిర్మించారని కేంద్ర పౌరసరఫరాలు, అటవీ, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే కితాబిచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్ట ఆలయానికి చేరుకున్న ఆయన స్వయంభూ నారసింహుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించిన నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా ఏండ్ల క్రితం యాదగిరిగుట్టను దర్శించుకున్నట్టు తెలిపారు. అప్పట్లో ఆలయం కేవలం 0.75 ఎకరాల్లో ఉండేదని, ప్రస్తుతం 4.5 ఎకరాల్లో మహా అద్భుతంగా పునర్నిర్మించారని కొనియాడారు.