యాదగిరిగుట్ట, ఏప్రిల్ 20 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి 20 రోజుల హుండీ ఆదాయం కోటిన్నర దాటిందని ఆలయ ఈవో గీత తెలిపారు.
గురువారం కొండ కిందగల సత్యనారాయణస్వామి వ్రత మండపంలో హుండీలను లెక్కించగా, రూ.1,86,38,644 నగదు, 241 గ్రాముల మిశ్రమ బంగారం, 4 కిలోల 650 గ్రాముల మిశ్రమ వెండి సమకూరిందని ఆమె పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీ కూడా వచ్చినట్టు వెల్లడించారు.