యాదగిరీశుడికి దర్బార్ సేవోత్సవం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి దర్బార్ సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది.
యాదాద్రి, డిసెంబర్21: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి దర్బార్ సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. బుధవారం సాయం త్రం ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు నాలుగు వేదాలు స్వామివారికి పారాయణం గావించారు. స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చి మంత్రపుష్ప నీరాజనం గావించి ఆశీర్వచనం చేశారు. ఉత్సవమూర్తులకు తిరువీధి సేవ వైభవంగా సాగింది.
స్వామివారిని గరుడ వాహనం, అమ్మవారి తిరుచ్చి సేవపై వేంచేపు చేసి ఆలయ తిరుమాడవీధుల్లో జరిపారు. స్వామివారికి తులసీ సహస్ర నామార్చన, ఆమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు శాస్ర్తోక్తంగా సాగాయి. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. ధనుర్మాసోత్సవంలో భాగంగా ఆండాళ్ అమ్మవారిని తిరుప్పావై పూజలు సాగాయి. కాగా, స్వామివారిని 14 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి ఖజానాకు రూ.18,83,947 ఆదా యం సమకూరిన్నట్టు ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

