యాదగిరి గుట్ట: యాదగిరిగుట్ట(Yadagirigutta ) శ్రీ లక్ష్మినరసింహస్వామి(Laxmi narasimha swamy) దేవాలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి(Darsanm) వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండపైన వాహనాల రద్దీ కొనసాగుతున్నది. ఎటు చూసినా భక్తులే దర్శనమిస్తున్నారు.
క్యూ లైన్(Que line) లో భక్తులు గంటల కొద్దీ వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ధర్మ దర్శనానికి(Darma darsan) 5 గంటలు, వీఐపీ (VIPదర్శనానికి 4 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు పలు చర్యలు తీసుకున్నారు.