యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో గురువారం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకిం చారు. తులసీ దళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో సుదర్శన నారసింహహోమం అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణం జరిపించారు. దేవేరులను ముస్తాబు చేసి గజవాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
లక్ష్మీసమేతుడైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కొండపైన పర్వతవర్ధ ని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. కొండకింద భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. సాయంత్రంవేళలో అలంకారజోడు సేవలు నిర్వహించారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠమూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన జరిగాయి. యాదాద్రి ఆలయంలో అత్యంత ప్రతిష్టా త్మకంగా జరుపుకునే సత్యనారాయణ స్వామి వ్రతాజల్లో భక్తులు భారీగా పాల్గొని సత్యనారా యణుడిని ఆరాధిస్తూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు.