యాదాద్రి, డిసెంబర్ 18 : యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామివారి ప్రధానాలయ పునర్నిర్మాణం సజావుగా పూర్తయిన సందర్భంగా వైటీడీఏ డిప్యూటీ స్థపతి జటావత్ మోతీలాల్నాయక్ ఆధ్వర్యంలో హతీరాం భవ, బాలాజీ.. తిరుపతికి పాదయాత్ర చేపట్టారు. ఈ మహా పాదయాత్ర యాదాద్రిలోని వైకుంఠ ద్వారం వద్ద ఆదివారం ప్రారంభమైంది. బంజారా కుటుంబం, భక్తులు, సాధు, సంత్లు, మహాసంత్లతో కలిసి డిప్యూటీ స్థపతి మోతీలాల్ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని బయలుదేరారు.
పాదయాత్రను వైటీడీఏ ప్రధాన స్థపతి సుందరరాజన్ జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోతీలాల్ మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర భువనగిరి, నాగార్జునసాగర్, గుడిపాడు, రాజోలు, రేణిగుంట మీదుగా సాగుతుందని అన్నారు. జనవరి 2వ తేదీ వరకు తిరుపతికి చేరుకొని స్వామివారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటామని తెలిపారు.