యాదాద్రి: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాలు భక్తుల్లో ఆధ్యాత్మికతను పెంపొందించేలా సౌకర్యవంతంగా సాగుతున్నా యి. స్వామి వారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు నిర్వహించే గిరి ప్రదక్షిణకు వైటీడీఏ అధికారులు సకల సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీన యాదాద్రి అభివృద్ధి పర్యట నలో భాగంగా ముఖ్యమంత్రి కేసీ ఆర్ ప్రత్యేకించి గిరి ప్రదక్షిణ రోడ్డును పరిశీలించారు.
కొండపైకి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు నుంచి రెండో ఘాట్ రోడ్డు మధ్యలో గల గిరి ప్రదక్షిణ రోడ్డు ఎత్తుగా ఉండటంతో పాద యాత్ర చేసే భక్తులకు ఇబ్బందిగా మారు తుందని రోడ్డుకు సమాంతరంగా ప్రదక్షిణ రోడ్డు నిర్మించాలని ఆదేశించారు. పాద యాత్రతో వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగవద్దని వైటీడీఏ అధికారులకు సూచించిన నేపథ్యంలో ప్రస్తుతం నిర్మించిన ప్రదక్షి ణ రోడ్డుకు పక్కనే కొండలను తొలగించి గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మిస్తున్నారు.
గుట్ట చుట్టూ ఎక్కడా ఎత్తు, ఒంపులు లేకుండా రోడ్డుకు సమాంతరంగా ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం చేపట్టారు. చుట్టూ సుమా రు 2.5 కిలోమీటర్ల వరకు రోడ్డు నిర్మించా రు. ఇరువైపులా అహ్లాదాన్ని పెంచే మొక్కలు, గార్డెనింగ్, నడిచేందుకు వీలు గా పార్కింగ్ టైల్స్‌ను అమరుస్తున్నారు.