యాదాద్రి భువనగిరి : తిరుమల తరహాలో యాదాద్రిలో దర్శనాలకు ఆలయ అధికారులు కసరత్తు ప్రారంభించారు. యాదాద్రి ఆలయం పునఃప్రారంభం తర్వాత ఆన్లైన్ టికెట్ల ద్వారా భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తారనే అంచనాతో ఆన్లైన్లో టికెట్ల జారీకి ప్రణాళిక రూపొందిస్తున్నారు. బ్రేక్, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం పేరిట దర్శనాల అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. స్కానింగ్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్లో టికెట్ల విక్రయంపై ప్రయోగాత్మకంగా పరిశీలించారు.