యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా లక్ష్మీనరసింహుడికి అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. 11 రోజులపాటు సాగిన తిరుకల్యాణ వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం రాత్రి డోలోత్సవంతో అర్చకులు ముగింపు పలికారు. మండపం లో 108 కలశాలు, 108 ద్రవ్యాలు, 108 ఔషధాలు, 108 మంత్ర జపాలతో వేదయుక్తంగా అర్పించారు. పూర్ణాహుతి నిర్వహించి స్వామివారికి శాంతి అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.