యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనారసింహస్వామి వారి నిత్య పూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. బాలాలయంలో కవచమూర్తులను అభిషేకించి అర్చించిన అర్చక బృందం బాలాలయంలో సుదర్శన నారసింహ హోమం జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్ల నిత్య తిరు కల్యాణోత్సవం ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు.
బాలాలయంలో సాయంత్రం స్వామి, అమ్మవారికి వెండిజోడు సేవను అత్యంత వైభవంగా జరిపారు. వివిధ ప్రాంతాల నుం చి వచ్చిన భక్తుల స్వామి వారి నిత్య కైంకర్యాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతాల లో భక్తులు పాల్గొని సామూహిక వ్రతాలచరించారు.
పూర్వగిరి(పాతగుట్ట) నరసింహస్వామి వారి నిత్య పూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి. యాదాద్రిలో స్వామి వారిని దర్శించు కునేందుకు భక్తుల తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు నిరాటoకంగా కొనసాగాయి.
స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ
యాదాద్రి లక్ష్మినరసింహ స్వామి వారిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ సెక్రటరీ అశోక్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకు ని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు వారికి స్వామి వారి వేద ఆశీర్వచనం, ప్రసాదం అందజేశారు.