భువనగిరి అర్బన్/సూర్యాపేట అర్బన్, నవంబర్ 22 : విద్యార్థులకు వడ్డించే ఆహార పదార్థాల్లో నాణ్యత పాటించాలని, లేకపోతే ఏజెన్సీ, హాస్టల్ వార్డెన్‌పై చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుంతరావు హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని తారకరామ నగర్లో గల ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.
అన్నం దొడ్డుగా ఉండడం, కూరలు సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నంబర్-2ను కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సందర్శించారు. భోజనశాలకు వెళ్లి వంట స్టాకు వివరాలు పరిశీలించారు.