హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆవరణలో జ్యోతిబాఫూలే విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వానికి లేఖ రాయాలని యునైటెడ్ ఫూలే ఫ్రంట్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌కు విన్నవించారు. ఈ మేరకు ఆదివారం వారి నివాసాల్లో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అలకుంట్ల హరి, దూగుంట్ల నరేశ్, ప్రజాపతి, గోపు సదానందం, నరహరి, ప్రవీణ్, కుమారస్వామి, మారయ్య, సాళ్వాచారి తదితరులు ఉన్నారు.