హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి హెరాయిన్ (Heroin) పట్టుబడింది. జోహెన్నెస్‌బర్గ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ప్రయాణికుడి వద్ద మత్తుమందు పట్టుబడింది. గత నెల 26న జోహెన్నెస్‌బర్గ్ నుంచి ఓ ప్రయాణికుడు హైదరాబాద్‌కు వచ్చాడు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీ నిర్వహిస్తుండగా ఓ ప్రయాణికుడిపై అనుమానం రావడంతో పట్టుకున్నారు. నిందితుడు 108 క్యాప్సూల్స్ మింగినట్లు గుర్తించారు. వైద్యుల పర్యవేక్షణలో వాటిని వెలికితీశారు. అవి 1389 గ్రాముల బరువు ఉన్నాయని, వాటి విలువ రూ.11.53 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని విచారిస్తున్నామన్నారు.