జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి (వెల్గటూర్)లోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలో ఆదివారం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తుండగా అన్నంలో తెల్లపురుగులు వచ్చాయి.
వార్డెన్‌ను వివరణ కోరగా, ఈ విషయం తన దృష్టికి రాలేదని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ప్రిన్సిపాల్‌ను ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.