వీర్నపల్లి, సెప్టెంబర్19 : రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి కస్తూర్బా గాంధీ విద్యాలయంలో శుక్రవారం అల్పాహారం (ఉప్మా)లోపురుగులు రావడం కలకలం రేపింది. పురుగులను గుర్తించిన విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. పురుగులకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో ఎంఈవో శ్రీనివాస్ పాఠశాలకు చేరుకొని, ఘటనపై ఆరాతీశారు. విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులు అల్పాహారంలో పురుగులు వచ్చాయనే విషయం ఎంఈవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ విషయంపై ఎంఈవో శ్రీనివాస్‌ను ఫోన్లో సంప్రదించగా, అల్పాహారంలో పురుగులు వచ్చినట్టు ముగ్గురు విద్యార్థినులు తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. పునరావృతమైతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.