హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ నోవాటెల్‌లో మూడురోజుల పాటు జరుగనున్న ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు మహాసభలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఉంటున్న తెలుగు ప్రముఖులు, కవులు, కళాకారులు, సినీనటులు, రచయితలు, భాషాభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. తొలిరోజు బిజినెస్ సమ్మిట్‌లో పాల్గొ న్న చంద్రబాబు మాట్లాడుతూ.. తెలు గు సంస్కృతిని కాపాడుకొని భవిష్యత్తుతరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ ప్రతీకగా నిలుస్తుందని అభివర్ణించారు. 2047 నాటికి ప్రపంచంలో నంబర్‌వన్ కమ్యూనిటీగా తెలుగుజాతి నిలువనున్నట్టు ఆకాంక్షించారు.