ఫోన్ పోయినా.. దొరకడం ఖాయం
మీ సెల్‌ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేక ఎవరైనా చోరీ చేశారా? అయినా చింతించనక్కర్లేదు. నేరుగా మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారే మీ ఫోన్ జాడ కనిపెడతారు.
- వెంటనే గుర్తించే ప్రత్యేక సాఫ్ట్వేర్ సీఈఐఆర్
- టెలికం దినోత్సవం సందర్భంగా రేపే ప్రారంభం
- తెలంగాణలో 718 లాగిన్స్: డీజీపీ అంజనీకుమార్
హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): మీ సెల్‌ఫోన్‌ను ఎక్కడైనా పోగొట్టుకున్నారా? లేక ఎవరైనా చోరీ చేశారా? అయినా చింతించనక్కర్లేదు. నేరుగా మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేస్తే వారే మీ ఫోన్ జాడ కనిపెడతారు. అవసరమైతే ఆ ఫోన్లోని విలువైన వ్యక్తిగత సమాచారం ఇతరులకు చేరకుండా బ్లాక్ కూడా చేస్తారు. బుధవారం (మే 17) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త విధానం అమల్లోకి రానున్నది. ప్రపంచ టెలికం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ (సీఈఐఆర్) సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పేరుతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నది. స్మార్ట్‌ఫోన్ పోయినా, చోరీకి గురైనా సీఈఐఆర్ ద్వారా బ్లాక్ చేయవచ్చు. ఆ తర్వాత ఆ ఫోన్ ఐఎంఈఐ నంబర్‌ను ఉపయోగించి దేశంలో ఎక్కడున్నా వెతికి పట్టుకోవచ్చు. ఇందుకోసం www.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది.
వెతికే బాధ్యత పోలీసులదే
ఎవరైనా ఫోన్‌ను పొగొట్టుకుంటే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. సరైన ఆధారాలతో మీరిచ్చిన ఫిర్యాదును సీఈఐఆర్‌లో నమోదు చేస్తారు. పోయిన ఫోన్లను వెతికి పట్టుకునేందుకు తెలంగాణలో 718 పోలీస్ స్టేషన్లకు లాగిన్స్ ఇచ్చారు. బాధితులు ఈ లాగిన్స్ ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాటిని వెతికే బాధ్యతను పోలీసులే తీసుకుంటారని డీజీపీ అంజనీకుమార్ సోమవారం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఆ ఫోన్లో కొత్త సిమ్‌కార్డు వేసినా వెంటనే పోలీసులకు తెలిసిపోతుంది. దాన్ని ఎవరు వాడుతున్నారు? ఏ నంబర్‌తో వాడుతున్నారు? వారి లొకేషన్ ఎక్కడున్నది? అనే విషయాలన్నింటినీ ఇట్టే కనిపెట్టేయవచ్చు. ఈ కొత్త టెక్నాలజీపై పోలీస్ శాఖ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 750 మంది పోలీస్ అధికారులకు ఈ టెక్నాలజీపై, పోయిన ఫోన్లను కనిపెట్టడంపై శిక్షణ ఇచ్చారు. దీంతో సోమవారం రాత్రి 7.30 వరకు దేశవ్యాప్తంగా 4,79,511 ఫోన్లను బ్లాక్ చేయగలిగారు. మరో 2,43,404 ఫోన్లను ట్రేస్ చేయగలిగారు.
వెబ్సైట్లో ఏం చేయాలంటే?
- ఫోన్ పోయిన వెంటనే ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అక్కడ పోలీసులకు వివరాలన్ని ఇస్తే.. వాటిని వారే ఎంటర్ చేస్తారు. మీరు ఎంటర్ చేసినా ఫర్వాలేదు. ఆ ఫిర్యాదు కాపీ తీసుకున్న తర్వాత www.ceir.gov.in వెబ్సైట్లో లాగిన్ కావాలి.
- అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్, అన్‌బ్లాక్ ఫౌండ్ మొబైల్, చెక్ రిక్వెస్ట్ స్టేటస్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- మీ ఫోన్‌ను పోగొట్టుకున్నా లేక చోరీకి గురైనా బ్లాక్ స్టోలెన్/లాస్ట్ మొబైల్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్ బ్రాండ్ పేరు, మాడల్, అందులో ఉన్న ఫోన్ నంబర్లు, దాని ఐఏంఈఐ నంబర్లు, కొనుగోలు బిల్లు అప్లోడ్ చేయాలి.
- అనంతరం మొబైల్ ఏ రోజు, ఎకడ పోయింది? ఏ రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు? అనే వివరాలు పొందుపర్చాలి.
- చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు (ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్) ఈ-మెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో ఫోన్ నంబర్ ఇవ్వాలి. అన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ కొడితే.. ఓ ఐడీ నంబర్ వస్తుంది. దానితో ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
- ఒకవేళ పోయిన మొబైల్ ఫోన్ దొరికితే అదే వెబ్సైట్లో అన్‌బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఐడీ నమోదు చేయగానే ఫోన్ అన్‌బ్లాక్ అవుతుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

