సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ సదస్సు
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.
- ప్రభుత్వం, టీటా ఆధ్వర్యంలో నిర్వహణ
- లోగోను ఆవిషరించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభు త్వం, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి. ప్రధానంగా టెక్నాలజీ ఎక్సేంజ్, ఇన్నోవేషన్స్‌పై దృష్టి సారించనున్న ఈ సదస్సు లోగోను టీహబ్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆవిషరించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు వస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణకు ప్రయోజనం కలిగించే ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని తెలుగు టెకీలకు సూచించారు. టీటా కార్యక్రమాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని ప్రకటించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తల మాట్లాడుతూ.. టీటా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి మద్దతు లభించడం సంతోషకరమన్నారు. సదస్సులో రాష్ట్ర మంత్రులతోపాటు పలు దేశ, విదేశ కంపెనీలు, స్టార్టప్‌లు, స్టూడెంట్ ఇన్నోవేటర్లు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం లో టీటా రాష్ట్ర కార్యదర్శి వినయ్ తూము, సభ్యులు శ్రీనివాస్ మర్రి, శ్రావణి బాసరాజు, క్రాంతి, వైద్యనాథ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

