భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ.. ఈ నెల 7న హైదరాబాద్‌లో ఐటీ కన్క్లేవ్ 2023ను నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలంగాణ టెక్ నిపుణులందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సింగపూర్‌లో వరల్డ్ తెలంగాణ ఐటీ కాన్ఫరెన్స్‌ను నిర్వహించనున్నారు.