Adivasi Day : తెలంగాణలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
Adivasi Day | తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గుస్సాడి, దింసా నృత్యాలతో

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గుస్సాడి, దింసా నృత్యాలతో ఆదివాసీలు సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు.
విశిష్ట, ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరజ్, పద్మశ్రీ గుస్సాడి కనకరాజు, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకులు సముజ్వల, కళ్యాణ్ రెడ్డి, విజయలక్ష్మి, లక్ష్మి ప్రసాద్, గిరిజన మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ సత్యనారాయణ, జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ సీతారాం నాయక్, చీఫ్ ఇంజనీర్ శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీల అభ్యున్నతి కోసం పనిచేసిన గొప్ప వారిని సన్మానించారు. 10 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎం ఎస్టీ ఎంటర్ ప్రెన్యుర్ షిప్ పథకం కింద 4.4 కోట్ల చెక్ అందించారు. అటవీ నుంచి నాణ్యమైన తేనేను ఉత్పత్తి చేసే వారికి రూ. 90 లక్షల విలువైన తేనె సేకరణ ఉపకరణాలు అందించారు. ఆదివాసీ మూలికా వైద్య విశిష్టత తెలిపే పుస్తకం, గోండు పద కోశం, పచ్చబొట్ల వైద్యం, ఆదివాసీల ఆహార, సంప్రదాయాలు తెలిపే పుస్తకాలు ఆవిష్కరించారు. గురుకులాల్లో చదువుతూ దేశంలో ప్రముఖ ప్రవేశ పరీక్షల్లో సీట్లు సాధించిన 183 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించడంలో భాగంగా వేదిక మీద నేడు 10 మంది ఆదివాసీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

