హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : సర్కార్ బడులు మరింత బలోపేతం చేయడానికి రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల సేవలు వినియోగించుకోవాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. జూన్‌లో పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో నూతన సర్పంచ్‌లకు ఒక రోజు వర్క్‌షాప్ నిర్వహించనున్నది. జిల్లాస్థాయిలో నిర్వహించే ఈ వర్క్‌షాప్‌ను డీఈవోలు ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కార్యక్రమాలు, సాధించిన విజయాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల పనితీరు, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, మౌలిక వసతులు, ప్రీ ప్రైమరీ, బ్రేక్‌ఫాస్ట్, ఎన్రోల్మెంట్, బడిబాట కార్యక్రమాలపై అవగాహన కల్పించనున్నది..