మాదాపూర్, సెప్టెంబర్ 29: మహిళల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఆదివారం సుధారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘పింక్ వపర్ రన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్‌రెడ్డి పీఏసీ చైర్మన్ ఆరికెపూడి గాంధీతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. మహిళల ఆరోగ్యం, సంక్షేమం కోసం రాష్ట్రంలో మరిన్ని దవాఖానాలు నిర్మిస్తామని చెప్పారు. పక్షి ఆకృతిలో అతిపెద్ద మానవహారంగా ఏర్పడిన వలంటీర్లను అభినందించారు. ఇందులో భాగంగా 2కే, 5కే, 10కే రన్ నిర్వహించగా విజేతలకు బహుమతులు అందజేశారు. ‘