మహదేవపూర్, మే 18 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మి) బరాజ్‌లో ఓ కార్మికుడు గల్లంతయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్గుప్తా (37) బరాజ్ వద్ద పని చేస్తున్నాడు. సోమవారం పనులు ముగించుకొని తోటికార్మికులతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా ప్రవీణ్గుప్తా ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ప్రవీణ్గుప్తా గల్లంతుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.