హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ విద్యా కమిషన్ తరహాలో ఫిషరీస్ కమిషన్ ఏర్పాటుకు కృషి చేయాలని తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్టల రవీందర్ మత్య్సశాఖ మంత్రి శ్రీహరికి గురువారం లేఖ రాశారు. శుక్రవారం నిర్వహించనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని విన్నవించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ మేరకు తెలంగాణ ఫిషరీస్ పాలసీ రూపొందించాలని కోరారు.
మత్స్యరంగ నిపుణులు, శాస్త్రవేత్తలు, విరమణ అధికారులను ఫిషరీస్ కమిషన్ సభ్యులుగా నియమించాలని సూచించారు. ‘మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నిరాశ నిస్పృహలో ఉన్న మత్య్సకారుల కుటుంబాలకు భవిష్యత్తుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు’అని లేఖలో తెలిపారు. మత్స్యకారుల ఆకాంక్షలు నెరవేరేవిధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.