మహబూబ్‌నగర్ : కర్ణాటకలోని టీబీ డ్యాంలో(Tungabhadra Dam) వరద తాకిడికి 19వ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. దాని స్థానంలో స్టాప్‌లాక్ గేటును(Stoplock gate) బిగించేందుకు ఇంజినీరింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. నిపుణుడు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో గురువారం పనులు చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రంలోగా భారీ క్రేన్ సాయంతో గేటును బిగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ 105 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 55 టీఎంసీలకు పైగా దిగువకు విడుదల చేశారు. డ్యాంలో నీటిమట్టం తగ్గితేనే గేటు ఏర్పాటు సులభంగా జరుగుతుందని ఇంజినీరింగ్ నిపుణులు భావిస్తున్నారు.